Chandrababu: డ్రగ్స్ వ్యసనానికి విద్యార్థులు దూరంగా ఉండాలి.! 15 d ago
పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. బాపట్ల జిల్లా పాఠశాలలో జరిగిన పేరెంట్స్-టీచర్స్ మీట్ కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. పిల్లల చదువును తల్లిదండ్రులు పర్యవేక్షించాలని, స్మార్ట్ ఫోన్లకు బానిసలు కాకుండా చూసుకోవాలని అన్నారు. డ్రగ్స్ వ్యసనానికి విద్యార్థులు దూరంగా ఉండాలని, డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుంచే ప్రారంభం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.